అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో కదులుతున్న రైల్లో నుంచి 3 ఏళ్ల చిన్నారి జారి కింద పడిపోయింది. తమిళనాడుకు చెందిన మురుగన్, సంగీత తమ మూడేళ్ల చిన్నారి వృతికతో కలిసి ముంబాయి నుంచి కుర్లా రైలులో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం రైలు... చాలకూరు గ్రామ సమీపంలోకి చేరుకొన్న సమయంలో సంగీత తమ చిన్నారికి భోజనం తినిపించి కుళాయి వద్ద చేయి కడుగుతుండగా.. ఆమె చేతిలో నుంచి చిన్నారి జారి కింద పడిపోయింది. వెంటనే కేకలు వేసి భర్తకు, తోటి ప్రయాణికులకు చెప్పింది.
ప్రయాణికులు రైలులో గొలుసు లాగి ఆపేశారు. బాధితులు తమ పాప ఆచూకీ కోసం రైలు పట్టాలపై పరుగులు తీస్తూ గాలింపు చేపట్టారు. ఆచూకీ లభించక పోవడంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై బాలాజీనాయక్, తమ సిబ్బందితో కలిసి చిన్నారి మృతదేహన్ని కనుగొన్నారు. అనంతరం అంబులెన్స్ లో మృతదేహన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ చిన్నారి మృతదేహాన్ని చూసి... తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.
ఇదీ చదవండి: