అనంతపురం జిల్లా కదిరి మండలం బ్రాహ్మణపల్లిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడి చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలను వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి బెదిరించడం అమానుషమన్నారు. పార్టీ మారేందుకు నిరాకరించిన మాత్రాన... వారిపై వేటకొడవళ్లతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయడానికి వైకాపా నేతలు ఎలాంటి అరాచకాలకైనా పాల్పడేలా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు తప్పుబట్టినప్పటికీ పోలీసుల తీరు మారడం లేదని... దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
'ఎన్నికలు కరోనా వైరస్ వల్ల కాదు.. క్యాస్ట్ వైరస్ వల్ల వాయిదా'