సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తయినందున వైకాపా కార్యాలయాల్లో జెండా ఎగురవేసి నేతలు సంబరాలు చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని నేతలు కొనియాడారు.
కడప జిల్లాలో...
వైకాపా అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలోని పార్టీ కార్యాలయంలో నేతలు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి.. పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని నేతలు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో...
సీఎం జగన్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినందున సందర్భంగా నేతలు సంబరాలు చేసుకున్నారు. దేశములో ఎక్కడా అమలు కానటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని నేతలు కొనియాడారు.
అనంతపురం జిల్లాలో...
వైకాపా అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో నేతలు సంబరాలు చేసుకున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 94.75 శాతం మేర ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. వైకాపా జెండా ఎగరవేసి... కేక్ కట్ చేశారు.
కృష్ణా జిల్లాలో...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని వైకాపా కార్యాలయాల్లో వేడుకలు జరిగాయి. పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేశారు. సుభిక్షమైన పాలన ప్రజలకందాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లాలోని వైకాపా కార్యాలయాల్లో సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని నేతలు పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో...
వైకాపా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో నేతలు వేడుకలను జరుపుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
విశాఖ జిల్లాలో...
వైకాపా అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో నేతలు సంబరాలు చేసుకున్నారు. జిల్లాలో ఈ రెండేళ్ల ప్రభుత్వ పాలనలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. అనకాపల్లిలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇదీ చదవండి