Case Registered Against MLC Independent Candidate : అనంతపురం జిల్లా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పొటీలో ఉన్న డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డితో పాటు మరో 21 మందిపై తాడిపత్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి లోని ఎస్బీఐ మిని బ్రాంచ్లో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని అనుమానించి నిర్వహకుడు శివ శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి, అతని మామ టీచర్ సాంబ శివా రెడ్డి, మరో టీచర్ శివా రెడ్డి, నాగేష్ తదితరులపై కేసు నమోదు చేశామని సీఐ ఆనంద రావు తెలిపారు. శివ శంకర్ రెడ్డి, నాగేషు వీరి ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని సీఐ ఆనంద రావు తెలిపారు.
టీచర్ల తరపున దీటుగా పోరాడుతున్నందుకే కక్ష సాధింపు : అధికార పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం తనపై, తనకు మద్దతు తెలిపిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించిందని ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికార పార్టీ అభ్యర్ధి బాక్సుల్లో పంపిచి, అలాగే పార్టీ ఫండ్ తెచ్చుకోని విచ్చల విడిగా డబ్బులు పంచుతుంటే ఒక్క కేసు లేదని, కానీ రూపాయి డాక్టర్ గా పేరున్న తనపై కేసు నమోదు చేసి ఇబ్బంది పెట్టాలనుకోవడం మరీ విడ్డురంగా ఉందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్ల తరపున దీటుగా పోరాడుతున్నందుకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన మండి పడ్డారు.
" అధికార పార్టీ అభ్యర్ధి ఏమో లోడ్లు లోడ్లు బాక్సుల్లో పంపించి అందులో కర పత్రాలు పెట్టి మరీ పంపిస్తే ఏ రోజు ఒక్క కేసు లేదు. అలాగే పార్టీ ఫండ్ తెచ్చుకోని విచ్చలవిడిగా డబ్బులు పంచుతాఉంటే ఒక్క కేసు లేదు కానీ రూపాయి డాక్టర్ మీద కేసు నమోదు చేసి ఇబ్బంది పెట్టాలనుకోవడం మరీ విడ్డురంగా ఉంది. ఇదేలా ఉందంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా ఉంది. ఇంటలీజెన్స్ రిపోట్స్ ప్రకారం దాదాపు 55 శాతం ఓటర్లు మన పక్షానే ఉన్నారు. అలాగే ప్రభుత్వ టీచర్లలలో దాదాపు సగానికి సగం మంది మన పక్షానే ఉన్నారు. అందుకే ఓడిపోతామనే భయంతోనే ఈ కుట్రలకు తెల లేపారు. - " చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి
ఇవీ చదవండి