తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పర్యటనకు ఏర్పాట్లు చేసిన ఇద్దరిపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు లాక్‌డౌన్ ఉల్లంఘన కేసు నమోదుచేశారు. కేసు అప్పుడే నమోదైనా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్టు క్రమంలో వారిని పరామర్శించడానికి లోకేశ్ సోమవారం తాడిపత్రి వచ్చారు. కొవిడ్-19 కారణంగా.. ఆ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానుల్లో చాలామంది మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని తాడిపత్రి టౌన్ ఎస్సై ఖాజా హుస్సేన్ ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులైన రఘునాథ, సోమశేఖర్‌పై జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్ 51(బీ), ఐపీసీ సెక్షన్ 188 కింద సీఐ తేజోమూర్తి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: అజరామరం: కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించిన 'తెలంగాణం'