ETV Bharat / state

డ్రైనేజీ సమస్యలపై భాజపా నేత ఆగ్రహం - drinage issue in kadapa dst

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక అధికారుల తీరుపై భాజపా నేత కొవ్వూరు బాలచంద్రారెడ్డి విమర్శించారు. మైదుకూరు రోడ్డులో దుకాణాలను ఆక్రమణల పేరుతో ధ్వంసం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.

cadapa dst produtur drainage problems bjp comments on state govt

author img

By

Published : May 30, 2020, 10:53 PM IST

ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక అధికారులు వ్యవహరిస్తున్నారని... వారి తీరు మార్చుకోవాలని భాజపా నేత కొవ్వూరు బాలచంద్రారెడ్డి సూచించారు.మైదుకూరు రోడ్డులోని దుకాణాల ముందు ఆక్రమణల పేరుతో ధ్వంసం చేశారని ఈ చర్యలతో యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దుకాణదారులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతి ఇచ్చినా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దుకాణాల ముందు ధ్వంసం చేయడంతో వేల రూపాయలు ఖర్చు చేసి యజమానులు బండలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

ఇంతవరకు కాలువల్లో పూడికలు తీయ లేదన్న ఆయన... వర్షం వస్తే నీరు బయటకు ఎలా వెళ్తుందో చెప్పాలన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి పనులకు ఉపయోగించాలని బాల చంద్రారెడ్డి కోరారు.

ఇదీ చూడండి ఆన్​లైన్​లో విచారణ.. అయితే క్రాస్ ఎగ్జామిన్​ ఇబ్బందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.