అనంతపురం జిల్లా ఉరవకొండలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబం ప్రయాణిస్తున్న బైక్ ను వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీ కొట్టడంతో ముందు బైక్ ఉన్న నలుగురు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఆజాద్ అనే వ్యక్తికి, అతని భార్య, కుమారుడికి తలకు బలంగా తగలడంతో, మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మరొక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఇదీ చదవండి:విశాఖలో విషాదం...ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి