JNTU Student Suicide: అనంతపురం జేఎన్‌టీయూ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన చాణక్య జేఎన్‌టీయూలోని ఎల్లోరా వసతి గృహంలో ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాల వలనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన చరవాణీలో పేర్కొన్నాడని పోలీసులు వివరించారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి