ఆస్తి తగాదాలలో అన్నను చంపిన తమ్ముడు అనంతపురం జిల్లా పామిడి మండలం ఖాదర్ పేట గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో సొంత అన్నని.. ఓ తమ్ముడు అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. గ్రామానికి చెందిన దివ్యాంగుడు నారాయణస్వామి గొర్రెలు మేపుతూ జీవిస్తున్నాడు. కొన్ని రోజులుగా తమ్ముడు నాగార్జునతో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అన్న తన మాట వినడం లేదని కక్షగట్టిన నాగార్జున.. దారుణానికి ఒడిగట్టాడు. తోడబుట్టినవాడన్న విషయాన్నీ మరిచిపోయాడు. ఇంటి బయట నారాయణస్వామి నిద్రిస్తున్న సమయంలో.. అదును చూసిదాడి చేశాడు. కళ్లలో కారం చల్లాడు. అతి దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఈ ఘాతుకంపై పోలీసులు కేసు నమోదు చేశారు.