సోదరుడు పై కొడవలితో దాడి... పరిస్థితి విషమం అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం గంగవరంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. బేలుగుప్ప మండలం గంగవరంలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు ఎర్రిస్వామిపై ఆయన సోదరుడు నాగభూషణ్ కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఎర్రిస్వామిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా గొడవలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. వ్యక్తిగత కక్షతోనే దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి
ద బిగ్ బాయ్.. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి ఆవిరి రైలు