Workshop on Donkeys: పూర్వకాలంలో గ్రామాల్లో బరువులు మోయాలంటే గాడిదలను ఉపయోగించేవారు. ఆయా వృత్తులు, వర్తక వ్యాపారులకు గాడిదలే ఆధారగా ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ... వాటి అవసరం లేకుండా పోయింది. ఎంతలా అంటే, వాటి జాతి అంతరించి పోయేంతలా... అలాంటి గాడిదల సంరక్షణ కోసం బ్రూక్స్ ఇండియా అనే సంస్థ పాటుపడుతోంది. వాటిని మాంసం, చర్మం కోసం అంతమొందించడం వల్ల వాటి ఉనికే ప్రమాదంలో పడుతుందని తెలియజేస్తూ అనంతపురం జిల్లాలో అవగాహన కార్యక్రమం చేపట్టింది.
అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో పశుసంవర్ధక రక్షణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నేటి సమాజంలో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతుందని.. వాటిని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో బ్రూక్స్ ఇండియా అనే సంస్థ రెడ్డిపల్లి పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధుల బృందంతో పాటుగా.. పలువురు శాస్త్రవేత్తలు, వైద్యులు బ్రూక్స్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. నేటి సమాజంలో గాడిదల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాడిదలను మాంసానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా గాడిదలను విదేశాలకు ఎక్కువ తరలిస్తున్నారని అభిప్రాయపడ్డారు. గాడిదల చర్మాన్ని చైనా లాంటి దేశాలకు పంపుతున్నారని వెల్లడించారు. గాడిదలను ఉపయోగించి పనులు చేయడం పూర్తిగా మానేశారని, వాటిని బదులుగా వాహనాలను వాడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో కేవలం 3600 గుర్రాలు, గాడిదలు మాత్రమే ఉన్నాయన్నారు. గాడిదల సంఖ్య తగ్గడానికి కారణాలతో పాటు.. వాటికి గల పరిష్కారాలపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. వాటిని సంరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చలు జరిపినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సదస్సు ద్వారా గాడిదలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గాడిదల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వంతో చర్చించి చర్యలు చేపడతామని తెలిపారు. గాడిదలను పెంచుకునే వాళ్లను సైతం ఈ కార్యక్రమానికి పిలిచినట్లు అధికారులు తెలిపారు. వారి అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు.
గ్రూప్ ఇండియావాళ్లు గాడిదల సంఖ్య తగ్గడంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా గాడిదలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి గాడిదల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తాం. ఉమ్మడి జిల్లాలో కేవలం 3600 గుర్రాలు, గాడిదలు మాత్రమే ఉన్నాయి. వాటిని సంరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించాం. -సుబ్రహ్మణ్యం, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్
ఇవీ చదంవడి: