అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పెన్న అహోబిలం జలాశయంలో శనివారం సాయంత్రం గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. పండగ సెలవులు కావడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 15 మంది గుంతకల్లు వాసులు పెన్నఅహోబిలం వచ్చారు. నీటిలో ఆడుకుంటున్న సమయంలో ఉద్ధృతికి సాయికృష్ణ (09) కొట్టుకుపోయాడు. పిల్లాడిని రక్షించే క్రమంలో బాలుడి చిన్నాన్న హనుమంతు గల్లంతయ్యాడు. వీరి ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఆదివారం ఉదయం ఏటిగంగమ్మ సమీపంలో హనుమంతు మృతదేహం లభ్యమైంది.
ఇదీ చదవండి: