అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. మొత్తం నాలుగు బ్లాక్ ఫంగస్ కేసులను అధికారులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ సోకిన నలుగురిలో ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఉద్యోగులెవరూ భయపడవలసిన అవసరం లేదని.. సమస్య వచ్చిన వెంటనే తమను సంప్రదిస్తే చికిత్స అందిస్తామని రైల్వే ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులు ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.
ఇదీ చదవండి: 'పాత్రికేయులంటే ప్రభుత్వానికి లెక్కలేదు'