ETV Bharat / state

'పోలవరం రివర్స్​ టెండరింగ్‌తో రైతులకు వేల కోట్ల నష్టం' - ఏపీలో భాజపా సంకల్ప యాత్ర

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్​ రివర్స్​ టెండరింగ్​ అంటూ మొండి వైఖరి అవలంబిస్తున్నారని భాజపా ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. ఈ పద్ధతి వల్ల రైతులు వేల కోట్ల నష్టపోయే ప్రమాదముందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై విమర్శలు సంధించారు.

'పోలవరం రివర్స్​ టెండరింగ్​ వల్ల రైతులు వేల కోట్లు నష్టపోతున్నారు'
author img

By

Published : Oct 21, 2019, 6:32 PM IST

'పోలవరం రివర్స్​ టెండరింగ్​ వల్ల రైతులు వేల కోట్లు నష్టపోతున్నారు'
పోలవరం ప్రాజెక్టులో రివర్స్​ టెండరింగ్​ వల్ల రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉందని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో మాట్లాడిన ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలపై మండిపడ్డారు. సీఎం జగన్​ మొండి వైఖరి విడనాడాలని సూచించారు. హంద్రినీవా పనులు ఎందుకు నిలిపేశారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రైతులకు ఇస్తోన్న ఆరు వేల రూపాయలను.. జగన్​ తానే ఇస్తున్నట్లుగా చెబుతున్నారని మరో నేత విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా నేతలు తెలిపారు.

ఇదీ చూడండి:

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీ.. కీలక చర్చ!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.