అనంతపురం జిల్లా ధర్మవరంలో భాజాపా నియోజకవర్గ స్థాయి సమావేశానికి.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ హాజరయ్యారు. తెదేపా నుంచి ఇటీవలే భాజపాలోకి వచ్చిన ఆయన.. తొలిసారి పార్టీ సమావేశానికి వచ్చారు. తప్పని సరి పరిస్థితుల్లో భాజపాలోకి రావాల్సి వచ్చిందని అనుచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో పనిచేద్దామని పిలుపునిచ్చారు. 6 నుంచి నిర్వహించే సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలని సూచించారు.
ఇదీ చూడండి:ఈనెల 5 నుంచి చంద్రబాబు 'భరోసా యాత్ర'