ETV Bharat / state

BJP leaders protest: సీఐ ఇస్మాయిల్​ను సస్పెండ్ చేయాలి: భాజపా

హిందూపురం 1 టౌన్ సీఐ ఇస్మాయిల్​ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ(BJP leaders demanded suspension of Hindupur 1Town CI Ismail) పోలీస్ స్టేషన్​ ఎదుట బైఠాయించి భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. భాజపా శ్రేణులపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

BJP leaders protest at Hindupur
హిందుపురం 1టౌన్​ పీఎస్​ వద్ద భాజపా ధర్నా
author img

By

Published : Nov 10, 2021, 7:56 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం 1 టౌన్ సీఐ ఇస్మాయిల్​ను సస్పెండ్ చేయాలని(BJP leaders demanded suspension of Hindupur 1 Town CI Ismail) భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్​ ఆవరణం(BJP leaders protest at Hindupur)లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతపురంలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్​కి నిరసనగా భాజపా ఆధ్వర్యంలో హిందూపురంలోని సద్భావన సర్కిల్​లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వాహనాన్ని భాజపా శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో హిందూపురం 1టౌన్ సీఐ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. భౌతిక దాడి చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ.. మా నాయకులపై దాడి చేసిన సీఐ ఇస్మాయిల్​ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమ్య హామీ ఇవ్వడంతో భాజపా నేతలు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో భాజపా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి, భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

పీఆర్‌సీ నివేదిక ఇచ్చేవరకు కదలం..సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.