ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ నాయకత్వం తప్పితే... మరొకరు కనిపించరని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వైకాపా, తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించి... ప్రాంతీయ పార్టీల శకం ముగిసిందన్నారు. భాజపా ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు నిజం కాకపోతే... వైకాపా, తెదేపా నేతలు ఎందుకు అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మీ పార్టీలో ఉండే నాయకులపై విశ్వాసం లేక... భాజపా నేతలపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు.
ఇదీ చదవండి : పాత ఫొటోలతో వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోంది: లోకేశ్