ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళనకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. జీడీపీలో పదిశాతం మేర కరోనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన... వైకాపా మనుగడపై ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు తప్పుపడుతున్నా లెక్కచేయని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలిచి తీర్పులిస్తున్న న్యాయవ్యవస్థనే తప్పుబట్టేలా వైకాపా నేతలు చేలరేగిపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: