వేసవిలో నీరు, ఆహారం దొరక్క అల్లాడిపోతున్న పక్షుల ఆలనాపాలనా చూడటానికి నడుం బిగించారు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే అధికారులు. వాటికి ఆహారం, వసతి అందించి.. పరిరక్షించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని చెట్లకు.. ప్రత్యేకంగా తయారుచేసిన ఆహారపెట్టెలను అమర్చారు.
చెట్ల కొమ్మల మధ్య అమర్చిన ఈ పెట్టెల్లో.. పక్షులకు కావాల్సిన నీరు, ధాన్యం గింజల్ని ఉంచారు. పక్షుల బాగోగులు చూసుకునే బాధ్యత రైల్వే స్కౌట్ వాలంటీర్లు తీసుకున్నారు. వారంలో రెండు మూడు రోజులకోసారి.. ఆ పెట్టెల్లో నీరు, ఆహారాన్ని నింపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని.. గుంతకల్లు డీఆర్ఎం అలోక్ తివారీ ప్రారంభించారు. వీటిని మరిన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటుచేసి.. పక్షుల ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్న ఈ సమయంలో పక్షులకు ఆహారం అందకపోతే అవి చనిపోయే ప్రమాదం ఉందని రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారి నీలిమ తెలిపారు. పక్షులకు ఆహారం అందించడానికి 25-30 ఆహారపెట్టెల్ని ఇక్కడి చెట్లకు అమర్చాం. రైల్వే స్కౌట్స్.. వారంలో రెండుసార్లు వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తారు. ఇలా పక్షుల్ని కాపాడుకోవచ్చని అన్నారు.
ఇదీ చదవండి: