గుంటూరు జిల్లాలోని తెనాలిలో నిర్వహించిన సంఘటన పర్వ్- 2019 కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని మోదీ పేదరిక నిర్మూలనకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ పథకాల పేర్లు మార్చి ప్రజలను వైకాపా మభ్యపెడుతోందని నేతలు ఆరోపించారు. కర్నూలులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ...ప్రపంచంలో 12 కోట్ల సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీ భాజపా అని తెలిపారు. అనంతపురం జిల్లా కదిరిలోనూ కార్యక్రమం నిర్వహించారు.
కడప జిల్లాలోని రాయచోటిలో సంఘటన పర్వ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆయన కోరారు.
ఇది చూడండి: 'ఒక గ్రూప్ బదులు... మరో గ్రూప్ రక్తం ఎక్కించారు'