ETV Bharat / state

అనంతలో ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్ - అనంతపురం జిల్లా హిందూపురంలో భారత్ బంద్

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా.. భారత్ బంద్ కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు సాగే ఈ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చారు.

ananthapur bandh
అనంతపురంలో భారత్ బంద్
author img

By

Published : Mar 26, 2021, 2:09 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా.. భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని కళ్యాణదుర్గంలో తలపెట్టిన రాస్తారోకో కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా.. వ్యాపారులు దుకాణదారులు స్వచ్ఛందంగా మూసివేశారు. సీపీఐ నేతలు రాస్తారోకో నిర్వహించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం సీపీఐ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉరవకొండలో

ఉరవకొండ మండలంలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని వారు కోరారు.

సీపీఎం నాయకుల ఆందోళన

అనంతపురం నగరంలో ఓ హోటల్ యజమానిపై.. సీపీఎం, సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ బంద్​లో భాగంగా దుకాణాలను మూసి వేయాలని తెలిపినా.. బస్టాండ్ సమీపంలో ఉన్న హోటల్ తెరవడంతో నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. హోటల్ మూసివేయాలని యజమానిని ఆదేశించగా.. హోటల్​ను మూసివేశారు.

ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో.. సీపీఎం, సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం.. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ప్రజలపై భారం మోపుతోందన్నారు. వ్యవసాయ రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.

హిందూపురంలో

హిందూపురంలో భారత్ బంద్ స్వచ్ఛందంగా కొనసాగుతోంది. విద్యాసంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆందోళనకారులు ఉదయాన్ని రోడ్డు మీదకు వచ్చి వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

తితిదే ఈవో జవహర్ రెడ్డి తీరును నిరసిస్తూ కార్మిక సంఘాల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.