అనంతపురం జిల్లా హిందూపురంలో గతంలో వీరంపల్లి వద్ద గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో బహుళ అంతస్తుల గృహసముదాయం వద్ద సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. ఇద్దరు మహిళా లబ్ధిదారులతో సీపీఐ నాయకులు గృహ ప్రవేశాలు చేయించారు. తాము ఇంటి కోసం అప్పు చేసి డీడీలు కట్టామని... ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ మహిళలు వెల్లడించారు. అందుకే నాయకుల సహకారంతో గృహ ప్రవేశాలు చేశామని తెలిపారు.
మరోవైపు సీపీఐ నాయకుడు దాదాపీర్ మాట్లాడుతూ... పేదల పట్ల వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. టిడ్కో గృహాల నిర్మాణంలో అవినీతి జరిగితే విచారణ జరిపించి బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకానీ పేదలను ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడ్డారు.
ఇదీ చదవండి
జగన్ లేఖ కేసు విచారణ ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్