అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో ప్రైవేటు పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన చిలమత్తూరులో ఓ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. మార్గమధ్యలో లేపాక్షి మండలం గలిబిపల్లి దగ్గరకు వచ్చాక గ్రామస్థులు బాలయ్య వాహనాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీపై ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ అక్కడే జోలి పట్టి భిక్షాటన చేశారు. గ్రామస్థుల నిరసనపై స్పందించిన బాలకృష్ణ... రహదారి వేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం తెదేపా నాయకుని కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.
హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం - హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం
హిందూపురంలో తన సొంత కార్యక్రమాల కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు గలిబిపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో ప్రైవేటు పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన చిలమత్తూరులో ఓ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. మార్గమధ్యలో లేపాక్షి మండలం గలిబిపల్లి దగ్గరకు వచ్చాక గ్రామస్థులు బాలయ్య వాహనాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీపై ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ అక్కడే జోలి పట్టి భిక్షాటన చేశారు. గ్రామస్థుల నిరసనపై స్పందించిన బాలకృష్ణ... రహదారి వేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం తెదేపా నాయకుని కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.
Body:balakrishna
Conclusion:attendmarriage