అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టెక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డబ్బులు, మద్యం తదితర ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులను ఎన్నుకోవాలని చెప్పారు. ఓటుహక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటు వేయాలని.. అర్హత ఉన్నవారు ఓటు నమోదు చేసుకోవాలని హితవు పలికారు. ఎలాంటి నాయకులకు ఓటు వేయాలి అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. 'యూజ్ ఓట్' అనే ఆకృతిలో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ఇవీ చదవండి..