పట్టు సాగు చేస్తున్న ఎస్సీ రైతులు ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని పట్టు పరిశ్రమ జేడీ పద్మమ్మ సూచించారు. అనంతపురం జిల్లా మడకశిరలో రాయితీపై రైతులకు అవగాహన కల్పించారు. పట్టు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని జేడీ తెలిపారు. షెడ్ల నిర్మాణం, మల్బరీ మొక్కల పెంపకానికి 90 శాతం రాయితీని అందిస్తున్నాయని చెప్పారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఇవీ చదవండి..