అనంతపురం జిల్లా అమడగూరు మండలంలోని కస్సముద్రం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన అత్త, కోడలు ఒకేరోజు ప్రాణాలు విడిచారు. అత్త వెంకట రమణమ్మకు ఆరోగ్యం బాగాలేక కదిరి ఆసుత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా.. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మణేమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయి గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. అయితే వెంకటరమణమ్మ భర్త విద్యుత్ షాక్తో కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. మణెమ్మ భర్త రెండు సంవత్సరాలు క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి...