అనంతపురం జిల్లా కదిరిలో ఓ వ్యక్తిపై మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. పట్టణానికి చెందిన జయరాంపై ఇద్దరు యువకులు కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన జయరాం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను 2015లో జరిగిన రౌడీషీటర్ నారాయణస్వామి హత్య కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నారాయణస్వామి అల్లుళ్లైన మహేష్, నాగరాజు తమ మామ హత్యకు ప్రతీకారంగా జయరాంను చంపాలని నిశ్చయించుకుని దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: