ETV Bharat / state

వివస్త్రను చేసి.. స్తంభానికి కట్టేసి.. మహిళపై విచక్షణారహిత దాడి! - అనంతలో మహిళపై దాడి

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం అనుమానంతో ఓ మహిళను వివస్త్రను చేసి విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళపై విచక్షణారిహిత దాడి
మహిళపై విచక్షణారిహిత దాడి
author img

By

Published : Mar 20, 2022, 10:13 PM IST

మహిళను వివస్త్రను చేసి, విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే పట్టణానికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేసి విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. చెప్పులతో కొడుతూ, కాళ్లతో తంతూ తీవ్రంగా గాయపరిచారు.

వివస్త్రను చేసి.. స్తంభానికి కట్టేసి.. మహిళపై విచక్షణారిహిత దాడి

ఈ రాక్షసకాండను అడ్డుకున్న స్థానికులు మహిళ శరీరంపై టవల్​ కప్పి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోగా మహిళకు జీవనోపాధి అయిన పండ్ల బండిని ధ్వంసం చేశారు. పండ్లను రోడ్డుపై చెల్లాచెదురుగా పారబోసి వీరంగం సృష్టించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

అమానుషం: స్కూటీపై పుల్లతో గీశాడని ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.