బుక్కరాయసముద్రంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి - బుక్కరాయసముద్రంలో వ్యక్తిపై కత్తితో దాడి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఓవ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సబ్‌స్టేషన్ వద్ద శింగనమల గ్రామానికి చెందిన 24 ఏళ్ల వడ్డే రవికుమార్‌ని వెంబడించి ఓ అగంతుకుడు కత్తితో పొడిచాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.