నిత్యం రద్దీగా ఉండే ఏటీఎంలలో దొంగలు పడి సొమ్మును దోచుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్ పక్కన ఉన్న ఏటీఎంలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. రాడ్లతో కొట్టి చోరీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే యంత్రం ఎంతసేపటికీ తెరుచుకోకపోవడం వల్ల అందులో ఉన్న డబ్బును దోచుకోలేకపోయారు. ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :