అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఆర్డీటీ కార్యాలయంలో విశాల ఫెర్రర్ సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సమాజం తమని చాలా హీనంగా చూస్తోందని ట్రాన్స్జెండర్లు వాపోయారు.
ఉన్నత విద్య స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా బతికే విధంగా చూస్తామని విశాల్ ఫెర్రర్ సంస్థ మేనేజర్ మంచు విశాల్ హామీ ఇచ్చారు. ట్రాన్స్ జెండర్స్కు కన్నీళ్లు తప్ప ఏమీ లేవని అన్నారు. వారికి ముఖ్యంగా సొంత నివాసం ఉండేలా ఏర్పాట్లు కల్పిస్తామని తెలిపారు. అనంతరం ట్రాన్స్ జెండర్ లక్ష్మీపతి, శ్రీమేఘన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూడాలన్నారు.
అంతకు ముందు నాగసముద్రం గ్రామంలోని ఆర్డిటీ పాఠశాలలో ఆరు నెలల పాటు టైలరింగ్ శిక్షణ తీసుకున్న 25 మంది మహిళలకు కుట్టు మిషన్లును ఉచితంగా సంస్థ ఉమెన్.ఎన్ ఫోర్స్ మెంట్ విశాల్ ఫెర్రర్ చేతుల మీదగా పంపిణి చేశారు.
ఇదీ చదవండి: అమరావతి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ మార్చి 5కు వాయిదా