అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇటీవల నిర్మించిన జాతీయ రహదారితో పట్టణంలోని బాలికల వసతి గృహానికి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని ఆరోపిస్తూ ఏఎస్పీఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. వసతి గృహంలో దాదాపు 250 మంది విద్యార్థినులు ఉన్నారని... జాతీయ రహదారి వల్ల హాస్టల్ కనపడకుండా మట్టి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటలపాటు ధర్నాకు దిగారు. భావి తరాలకు ఉపయోగపడే ప్రభుత్వ వసతి గృహాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారి నిర్మించే ఇంజనీర్లు వచ్చి రేపటి నుంచి పనులు మొదలు పెడతామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు. పట్టణంలో ఉన్న అన్ని వసతి గృహాల వార్డెన్లు వీరికి మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి... అంతామాయ... సబ్సిడీ విత్తనాల పట్టివేత!