ETV Bharat / state

'కరోనా పరీక్షలు చేయించినందుకు కాలనీ వాసులు తిడుతున్నారు'

వృత్తిలో భాగంగా కాలనీలోని కరోనా అనుమానితులకు పరీక్షలు చేయించినందుకు కాలనీ వాసులు దుర్భాషలాడుతున్నారని.. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన ఆశావర్కర్ ఆరోపించారు. తనకు వారినుంచి రక్షణ కల్పించాలని అధికారులను వేడుకున్నారు.

author img

By

Published : Jul 23, 2020, 6:24 PM IST

asha worker agitation in madakasira ananthapuram district
ఆశావర్కర్ ఆవేదన

తన బాధ్యతగా అనుమానితులకు కొవిడ్ పరీక్షలు జరిపించినందుకు కాలనీ వాసులు దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆశావర్కర్ ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.

అనంతపురం జిల్లా మడకశిర ఎస్టీ కాలనీలో ముత్తులక్ష్మీ అనే మహిళ ఆశావర్కర్​గా పనిచేస్తోంది. కాలనీలోని ఓ మహిళకు జ్వరం రావటంతో కరోనా పరీక్షలు చేయించింది. ఆమెకు పాజిటివ్ నిర్ధరణ కాగా.. ఆమెతో కాంటాక్టులో ఉన్న మరికొందరికి ముత్తులక్ష్మి కొవిడ్ పరీక్షలు చేయించింది. అయితే అందరికీ నువ్వు పరీక్షలు ఎందుకు చేయిస్తున్నావంటూ కాలనీ వాసులు తనను వేధిస్తున్నారని ముత్తులక్ష్మి ఆరోపించింది. వృత్తిలో భాగంగా తన పని తాను చేసినందుకు వారితో మాటలు పడాల్సివస్తోందని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంది.

ఇవీ చదవండి..

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరోగ్య విపత్తు తలెత్తే ప్రమాదం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.