ఇళ్ల పట్టాల కోసం నార్పలలో కళాకారుల నిరసన
ఇళ్ల పట్టాల కోసం నార్పలలో కళాకారుల నిరసన - నార్పలలో కళాకారుల నిరసన
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో ఇళ్ల పట్టాల కోసం డప్పు, వాయిద్య కళాకారులు నిరసన తెలిపారు. గత 35 సంవత్సరాల నుంచి కళాకారులుగా పని చేస్తున్నామని.. ప్రభుత్వం తమను గుర్తించి బహుమతులు సైతం ప్రధానం చేసిందని గుర్తు చేశారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఎంతో కష్టపడి సొంత డబ్బుతో ఇళ్లు నిర్మించుకున్నామని చెప్పారు. ఇప్పుడు తమ ఇళ్ల పట్టాలు రద్దు చేస్తున్నామని తహసీల్దార్ అనడం ఎంతవరకూ సమంజసమని వాపోయారు. తమ ఇళ్ల పట్టాలు తమకు ఇప్పించాలని కళాకారులు డిమాండ్ చేశారు.

నార్పలలో కళాకారుల నిరసన
ఇళ్ల పట్టాల కోసం నార్పలలో కళాకారుల నిరసన
ఇదీ చదవండి:
తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే, రైతుల బైఠాయింపు