ప్రమాదాల బారిన పడి చేతులు, కాళ్లు కోల్పోయిన నిస్సహాయులకు అనంతపురం జిల్లా కదిరి రోటరీ క్లబ్ అవయవాలను అమర్చేందుకు.. శిబిరం ఏర్పాటు చేసింది. బెంగళూరు సౌత్ రోటరీ క్లబ్ సహకారంతో కదిరి పట్టణంలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో.. కృత్రిమ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు. మోచేతికి కింది భాగంలో ప్రమాదాల రూపంలో చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ చేతులను ఉచితంగా అమర్చారు. దివ్యాంగులు కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమ పనులు చేసుకునేందుకు అవయవాలు ఉపయోగపడతాయని నిపుణులు సూచించారు.
కదిరి పరిసర ప్రాంతాల వారికి ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన రోటరీ క్లబ్ కదిరి శాఖ ప్రతినిధులను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అభినందించారు. కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరంలో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో సహా పలు రాష్ట్రాలకు చెందిన 250 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. కృత్రిమ అవయవాలను పంపిణీ చేయడంతో పాటు వాటికి మరమ్మతులను ఉచితంగా చేయిస్తామని రోటరీ క్లబ్ కదిరి శాఖ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి.
Floods Effect on Devipatnam: జలదిగ్బంధంలో దేవీపట్నం.. ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఆగ్రహం