ETV Bharat / state

'దరఖాస్తుదారులకు సమాచారాన్ని గడువులోగా ఇవ్వాలి'

సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తుదారులు అడిగిన సమాచారాన్ని గడువులోపు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు రాష్ట్ర ప్రధాన కమిషనర్ రవికుమార్ అధికారులను ఆదేశించారు.

దరఖాస్తుదారులకు సమాచారాన్ని గడువులోగా ఇవ్వాలి
author img

By

Published : Aug 31, 2019, 9:50 PM IST

దరఖాస్తుదారులకు సమాచారాన్ని గడువులోగా ఇవ్వాలి

దరఖాస్తుదారులు అడిగిన సమాచారాన్ని గడువులోపు ఇచ్చేలా అధికారులు పీఐఓలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సమాచార హక్కు రాష్ట్ర ప్రధాన కమిషనర్ రవికుమార్ సూచించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారం క్రిందిస్థాయిలో వెంటనే ఇవ్వగలిగితే ఫిర్యాదులు 50 శాతంపైగా తగ్గుతాయని తెలిపారు. ప్రధానంగా ఐదు ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం ఇవ్వడంలో పీఐఓలు, అప్పిలేట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చురకలేశారు. ప్రజల్లో సమాచార చట్టంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆయన వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కమిషన్ కు వచ్చే ఫిర్యాదులు పరిష్కారానికి మూడు నెలలకోసారి జిల్లాల వారీగా పర్యటించి, విచారణలు నిర్వహిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

ఇదీచదవండి

నా చిన్ననాటి కల.. ఇప్పుడు నెరవేరింది: ఉపరాష్ట్రపతి

Intro:పచ్చదనం తో నే ఆరోగ్యవంతమైన జీవితం. మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్య వంతమైన జీవితం గడపవచ్చునని జగ్గంపేట mla జ్యోతుల చంటి బాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సూదికొండ అటవీశాఖ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గున్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మొక్కలు నాటడం తో పాటు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో ఇటీవల సుమారు 70 వేల మొక్కలను నాటడం జరిగిందని ఈ సంఖ్యను మరింత పెంచి పచ్చదనం పెంపొందిస్తామన్నారు.

Body:8008622066

Conclusion:యతిరాజులు, తూర్పుగోదావరి, జగ్గంపేట నియోజకవర్గ, గోకవరం మండలం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.