విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోకపోతే ఉద్యోగ సంఘాలను కలుపుకొని పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే.. హిందుస్థాన్ జింక్ మాదిరిగానే అవుతుందన్నారు. పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని.. ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతినే... మళ్లీ ప్రవేశపెట్టాలని కోరారు. జీపీఎఫ్ అడ్వాన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో చెల్లించటం లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి..
పవన్ స్టేట్ రౌడీ.. ఆయన అనుచరులే ఆకు రౌడీలు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్