అప్పుల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానం..
అప్పుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ తీసుకోని రుణాలను ఆంధ్ర ప్రదేశ్ తీసుకుంది. ప్రతి నెలా కాగ్ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నెలలు గడుస్తున్నా వరద బాధితులకు అందని పరిహారం..
గోదావరి వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ సహాయంగా ఇస్తామన్న పరిహారం.. నెలలు గడుస్తున్నా చాలా మందికి అందలేదు. సర్వే అనంతరం 8 వారాల్లోనే నగదు అందుతున్న ముఖ్యమంత్రి మాట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
"అన్నదాతలను ఆదుకుంటానని మాటిచ్చి తప్పిన సీఎం ఎక్కడ"
రాష్ట్రంలో టమాటా రైతుల పరిస్థితి దారుణంగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటానని రైతులకు మాటిచ్చి.. ఇప్పుడు మాట తప్పుతున్నాడని లోకేశ్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గుజరాత్ పీఠం కోసం కాంగ్రెస్ నయా ప్లాన్.. 'బాదామ్'తో రంగంలోకి..
గుజరాత్ ఎన్నికల్లో ఈసారి తమ పార్టీ జెండాను ఎగరవేయాలని కాంగ్రెస్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో భాజపాతో పాటు ఆప్ మరో అడ్డంకిగా మారింది. దీంతో రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతలు 'బాదామ్' వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. అసలు ఈ బాదామ్ వ్యూహం అంటే ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెరుచుకున్న శబరిమల ఆలయం.. 41రోజుల పాటు మండల పూజ.. భారీగా భక్తుల తాకిడి!
శబరిమల ఆలయం మండల పూజ కోసం తెరుచుకుంది. తొలిరోజే భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఆన్లైన్, స్పాట్ బుకింగ్ ఉన్నవారికే దర్శనానికి అనుమతిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మార్కెట్‌లో ఆందోళనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి.. 10 మందికి గాయాలు
ఇరాన్‌లో రద్దీగా ఉండే ఓ మార్కెట్‌లో ఆందోళనకారులపై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 10 మందికిపైగా గాయపడ్డారు. ఇరాన్ మహిళలకు ఆ దేశ ప్రభుత్వం నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ను నిరసిస్తూ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌లో మహ్సా అమీని మరణం తర్వాత ఈ ఆందోళనలు మరింత ఉద్ధృత రూపం దాల్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూట్యూబ్ కింగ్‌గా 'మిస్టర్ బీస్ట్'.. సబ్స్క్రైబర్ల సంఖ్యలో ప్యూడీపై రికార్డ్ బ్రేక్
యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లు గల వ్యక్తిగత ఖాతాగా రికార్డు సాధించింది మిస్టర్ బీస్ట్. యూట్యూబ్‌లోనే అత్యధిక సబ్‌స్క్రైబర్ గల ఛానల్స్ ఏంటో తెలుసా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మంచి ఆరోగ్యం కోసం రోజుకు 10 వేల అడుగులు.. ఇదేం లెక్క?
రోజూ కాసేపు వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే ఉరుకులు పరుగుల జీవితంలో తమకు టైమ్ దొరకడం లేదని చాలా మంది అంటుంటారు. కానీ రోజులో కనీసం 10వేల అడుగులు నడిస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం కోసం రోజుకు 10 వేల అడుగులా? ఇదేం లెక్క? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'ఇప్పుడైతే మా టార్గెట్ ఆటను ఆస్వాదించడమే.. భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడతాం'
ప్రపంచకప్ వైఫల్యం నుంచి తమ జట్టు బయటపడాలని టీమ్‌ఇండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్‌నకు ప్రణాళిక మొదలవుతోందని హార్దిక్ అన్నాడు. మరోవైపు, టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విమర్శలకు హార్దిక్ కౌంటర్ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బాలయ్యను ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ యాక్టర్.. మిస్ వరల్డ్‌తో 'మెగా' హీరో!
నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'వీరసింహారెడ్డి' మూవీ కోసం ఓ బాలీవుడ్ నటుడు విలన్‌గా రానున్నారు. మరోవైవు విశ్వసుందరితో ఓ యువ స్టార్ జతకట్టనున్నారట. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.