రాష్ట్రంలో రాజధాని గందరగోళానికి ముఖ్యమంత్రి తెరదించకపోవటం దారుణమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనను వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు సహా ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తుంటే జగన్ స్పందించకపోవటం దుర్మార్గమన్నారు. 20 కోట్ల జనభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌కు ఒకేఒక్క రాజధాని ఉంటే.. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమా ? అని ప్రశ్నించారు. జగన్ చర్యను దేశంలో ఉన్న మేధావులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
ఇదీచదవండి