ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ కరికాల వల్లవన్.. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వ్యక్తిగత పనిమీద కదిరి వచ్చిన ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు స్వామివారి విశిష్టతను స్పెషల్ చీఫ్ సెక్రటరీకి వివరించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డప్ప శెట్టి, ఈవో వెంకటేశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు వల్లవన్ను ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికతో పాటు ప్రసాదాన్ని అందజేశారు.
ఇదీ చదవండి: రుణాలు ఇవ్వటం లేదని బ్యాంకుల ముందు చెత్త పారబోత