ETV Bharat / state

ఇక.. ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో చేనేత వస్త్రాలు - AP hand loom clothes at online

ధర్మవరం మెరుపులు... మంగళగిరి సొగసులు.. ఇకపై ఫ్లిప్​కార్ట్, అమెజాన్​లో అందుబాటులోకి రానున్నాయి. చేయనున్నాయి. దళారుల మోసాలు, మరమగ్గాల పోటీలతో అల్లాడిపోతున్న చేనేత కార్మికులకు మంచి రోజులు రాబోతున్నాయి. చేనేతతో పాటు పట్టు వస్త్రాలనూ ఆన్‌లైన్‌లో విక్రయించడానికి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఆప్కో ద్వారా వస్త్రాలను సేకరించి ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు కసరత్తు కొనసాగుతోంది.

ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో చేనేత వస్త్రాలు
author img

By

Published : Nov 6, 2019, 1:43 PM IST

ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో చేనేత వస్త్రాలు

చేనేత వస్త్రాల మన్నిక, నాణ్యతే వేరు... కానీ... మరమగ్గాలపై తయారైన వస్త్రాలు, పట్టుచీరలు మార్కెట్లో చౌకగా లభిస్తాయి. చేనేత అని చెబుతూ మరమగ్గాల చీరలను తక్కువ రేట్లతో అమ్ముతున్నారు. ఈ పరిస్థితి నేతన్న ఉపాధికి గండి కొడుతోంది. మార్కెట్లో ఏది చేనేతో, ఏది మరమగ్గం వస్త్రమో నిపుణులే గుర్తించలేనంతగా తయారవుతున్నాయి. ఈ విషయంపై చేనేత సహకార సంఘాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. పరిష్కారంగా... చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెట్‌లో చోటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ కామర్స్ సంస్థలు... అమెజాన్, ఫ్లిప్‌క్లార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేనేత వస్త్రాలు విక్రయించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆప్కో సంస్థ ద్వారా చేనేత వస్త్రాలు సేకరించాలని చేనేత, జౌళి శాఖ నిర్ణయించింది. కంప్యూటర్ డిజైనింగ్ కూడా అందుబాటులోకి వచ్చినందున.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చేనేత కార్మికులు సిద్ధమవుతున్నారు. తమ డిజైన్లు ఆన్‌లైన్ ద్వారా ప్రపంచానికి తెలిసే అవకాశం కలగడమే కాక.. అమ్మకాలు పెరుగుతాయని నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలుత 25రకాల వస్త్రాలను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

చేనేత వస్త్రాలను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కార్మికులు, మాస్టర్‌ వీవర్స్‌ అమ్మకాలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.