అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల 15న ఒక రోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ శుక్రవారం ఆదేశించారు. ఈ నెల 8న తాడిపత్రి పురపాలక సంఘ పరిధిలో శ్రీరాములపేటలో చీరలు, బట్టలు పంచినట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయించి నిర్ధారించుకున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించి ఎన్నికల నిబంధనల కింద ప్రాసిక్యూషన్ చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం