అనంతపురం జిల్లా ఉరవకొండలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మరో 14 కేసులు నమోదయ్యాయి. పట్టణంలో మొత్తం బాధితుల సంఖ్య 22కి చేరింది. ఈ 14 మందిలో ఓ బ్యాంక్ ఉద్యోగి, ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉన్నారు. గాంధీ చౌక్, శాంతినగర్, అంబేడ్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించారు. మరీ అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయంలో, బ్యాంక్‌లోనూ హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వదలడం లేదని... అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి భయపడుతున్నారు.
ఇదీ చదవండి: