అనంతపురం గుత్తిరోడ్డుకు చెందిన వైకాపా నగర మైనార్టీ నాయకుడు రోషన్ జమీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో జమీర్ చేతికి బలమైన గాయమైంది. కొన్ని రోజులుగా నొప్పి భరించలేక సతమతమవుతున్నాడని బంధువులు తెలిపారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి.. అతనికి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: నీలకంఠపురంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి పర్యటన