కరోనా వైరస్ వ్యాప్తి నివారణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హచ్చరించారు. అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నగర ప్రజలకు కలెక్టర్‌తో కలిసి శానిటైజర్లు పంపిణీ చేశారు. హిందూపురం పరిధిలో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. ఎవరూ బయట తిరగకూడదన్నారు.
ఇదీ చదవండి: రెండు విడతల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు