పోలీస్ వ్యవస్థలో అవినీతికి తావుండరాదని... వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు స్పష్టం చేశారు. జిల్లాలోని సెబ్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి దూరంగా ఉండాలన్నారు. ఒక్కరు తప్పు చేసినా మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కావునా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: