ETV Bharat / state

'రాయలసీమ ప్రజలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది' - అనంతలో పీడీఎస్​యూ నాయకుల నిరసన

కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలో శాసనసభ స్థానాలను పెంచాలని డిమాండ్​ చేస్తూ పీడీఎస్​యూ, పట్టణ పేదల సంఘాలు ధర్నాకు దిగాయి. రాయలసీమ ప్రాంత ప్రజల పట్ల వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆ సంఘ నాయకులు ఆరోపించారు.

ananthapuram pdsu and pps leaders protest
నిరసనలో పాల్గొన్న పీడీఎస్​యూ, పట్టణ పేదల సంఘం
author img

By

Published : Oct 1, 2020, 7:02 PM IST

పట్టణంలోని పప్పూరు రామాచార్యుల విగ్రహం వద్ద పీడీఎస్​యూ, పట్టణ పేదల సంఘం నాయకులు నిరసనకు దిగారు. వైకాపా ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజలపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విభజన హామీలలో భాగంగా ఎయిమ్స్​ తరహా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

కోస్తాంధ్రతో పాటు సమానంగా శాసనసభ స్థానాలను పెంచాలని డిమాండ్​ చేశారు. అంతేకాకుండా అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలిపారు. రాయలసీమ హక్కుల పత్రంలోని మిగిలిన అంశాలను అమలు చేయాలన్నారు.

ఇదీ చదవండి:

ఇంద్రపాలెంలో అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ రజకుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.