ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ సత్య యేసుబాబు తెలిపారు. ఎనిమిదో తేదీన రాయదుర్గంకు సీఎం రానున్నందున హెలిప్యాడ్, రూట్ బందోబస్తు, బహిరంగ సభా స్థలాన్ని కలెక్టర్ నాగలక్ష్మి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తో కలిసి పరిశీలించారు.
రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో స్పెషల్ పార్టీలు కూంబింగ్ నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రాకతో స్థానిక ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
సెమిస్టర్ పరీక్షలు రాసే విద్యార్థుల భద్రతపై.. ప్రభుత్వం దృష్టి పెట్టాలి: లోకేశ్