వైకాపా ప్రభుత్వానికి పాలించడం చేతకాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెట్టేందుకే 3 రాజధానుల నాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో.. అలానే అమరావతి విషయంలోనూ దృష్టిపెట్టాలని కోరారు. ఇది 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన విషయమని.. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి...