అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారంటూ గ్రామస్థులు ఆరోపించారు. రేషన్ కార్డు కావాలంటే వెయ్యి రూపాయలు, కార్డులో మార్పులు చేసుకోవాలంటే రూ. 100 లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
ఇళ్ల స్థలాలకు అర్హుల పేర్లు నమోదు చేయకుండా.. వైకాపా నేతలు చెప్పినవారి పేర్లు నమోదు చేస్తున్నారని వాపోయారు. సచివాలయంలో ఏ పని జరగాలన్నా డబ్బులు సమర్పించాల్సి వస్తోందని చెప్పారు. ఇళ్ల పట్టాల విషయంలో న్యాయం చేయాలని కోరారు.
'మా గ్రామ సచివాలయంలో కొంతమంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి చిన్న పనికి డబ్బులు అడుగుతున్నారు. ఇళ్ల స్థలాల కోసం రెండు జాబితాల్లో నమోదైన అర్హుల పేర్లు తీసేశారు. మూడో జాబితాలో వారి పేర్లు లేవు. ' -- గ్రామస్థులు ఆవేదన
-
ఇవీ చదవండి:
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?: తెదేపా